![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో సెలబ్రిటీల వైరల్ ఫోటోల కోసం ఓ మినీ యుద్ధమే జరుగుతుంది. సమ్మర్ అయిపోయి వర్షాకాలం వచ్చేసింది. ఇక అందరు తమ వెకేషన్ ని మాన్ సూన్ వైబ్స్ కి మార్చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అరియానా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
తెలుగు బిగ్ బాస్ గేమ్ షోతో చాలామంది క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాకముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు కాస్త గట్టిగానే వినిపించింది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అలాగే అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది. ఇక బయటకొచ్చాక కూడా ఫోటోషూట్ లు , రీల్స్ అంటు తరచూ ట్రెండింగ్ ఉంటుంది.
ఎప్పుడు గ్లామర్ ట్రీట్‌లో తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయే ఈ బ్యూటీ.. మొన్నే నాభి అందాలు చూపిస్తూ కనువిందు చేయడంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడేమో అడవిలోని ఓ స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లింది. ఆ లోకేషన్ చూస్తే ఎక్కడో కొండల్లో ఉన్నట్టుగా ఉంది. ఎత్తైన కొండల మీద స్విమ్మింగ్ పూల్.. అందులో అరియానా అందాల విందు.. వహ్.. అటు నేచర్.. ఇటు గ్లామర్.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న ఈ ఫోటోలని అత్యధికమంది చూశారు. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ జలకాలాటల్లో అంటూ జాలీగా ఫొటోలకి ఫోజులిచ్చింది అరియానా. రెడ్ టాప్ లో అరియానా చాలా అందంగా ఉందంటూ తన ఫాలోవర్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ స్విమ్మింగ్ ఫూల్ లో తను స్విమ్ చేస్తున్న వీడియోని కూడా షేర్ చేసింది ఈ భామ. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |